Share News

Congress Party: ఓటు చోరీపై ఢిల్లీలో నేడు కాంగ్రెస్‌ మహార్యాలీ

ABN , Publish Date - Dec 14 , 2025 | 04:41 AM

ఓటు చోరీ ఆరోపణలపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం ఢిల్లీలో మహార్యాలీని నిర్వహించనుంది.

Congress Party: ఓటు చోరీపై ఢిల్లీలో నేడు కాంగ్రెస్‌ మహార్యాలీ

న్యూఢిల్లీ, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఓటు చోరీ ఆరోపణలపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ ఆదివారం ఢిల్లీలో మహార్యాలీని నిర్వహించనుంది. రామ్‌లీలా మైదానంలో మధ్యా హ్నం 2 గంటల నుంచి ఈ ర్యాలీ ప్రారంభంకానుంది. ఎన్నికల్లో రిగ్గింగ్‌ చేయడానికి మోదీ ప్రభుత్వం, ఎన్నికల సంఘం (ఈసీ) కుమ్మక్కయ్యాయని రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకే కాంగ్రెస్‌ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Dec 14 , 2025 | 04:41 AM