Rahul Gandhi: పహల్గాంపై నోరెత్తవద్దు
ABN , Publish Date - Apr 29 , 2025 | 05:16 AM
పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని కాంగ్రెస్ నేతలు ఆదేశించారు. బీజేపీ విమర్శలతో, రాహుల్ గాంధీ, ఖర్గే తమ నేతలకు తగిన సూచనలు ఇచ్చినట్లు ఏఐసీసీ ప్రకటించింది.
కాంగ్రెస్ నేతలకు అధిష్ఠానం హెచ్చరిక
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: కాంగ్రెస్ అధిష్ఠానం ఎట్టకేలకు కళ్లు తెరచింది. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాద దాడి అంశంపై నోరెత్తవద్దని, వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని పార్టీ నేతలను ఆదేశించింది. ఉగ్రవాద దాడి, సింధు జలాల ఒప్పందం సస్పెన్షన్‌పై తమ నేతలు కొందరు పాకిస్థాన్‌కు మద్దతుగా మాట్లాడుతుండడం.. 26 మంది పర్యాటకులను హత్య చేస్తే తేలిగ్గా తీసుకోవడం.. వారిని చంపేముందు ఉగ్రవాదులు మతం అడగలేదనడం.. తమ వారి హత్యలను కళ్లారా చూసిన బాధితులే మతి చలించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించడం.. దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతో రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొందరు పార్టీ నేతలు కేంద్రానికి, యుద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వీరి వ్యాఖ్యలను పాక్, ఆ దేశ మీడియా తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నేతలెవరూ బహిరంగంగా ఎలాంటి వ్యతిరేక ప్రకటనలు చేయొద్దని రాహుల్, ఖర్గే ఆదేశించారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ సోమవారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఉగ్రదాడిపై వర్కింగ్ కమిటీ తీర్మానం, ఖర్గే, రాహుల్, అధీకృత ఏఐసీసీ ఆఫీసు బేరర్లు వ్యక్తంచేసే అభిప్రాయాలను మాత్రమే పార్టీ వైఖరిగా పరిగణించాలని కోరారు.
ఇవి కూడా చదవండి..
PM Modi: ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 40 నిమిషాల భేటీ..ఏం చర్చించారంటే..
Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం
For National News And Telugu News