Share News

P Chidambaram: 8 ఏళ్ల తర్వాత తప్పు దిద్దుకున్నారు

ABN , Publish Date - Sep 05 , 2025 | 04:55 AM

ఒకే దేశం ఒకే పన్ను పేరిట ఇప్పటి వరకూ ఒకే దేశం 9 పన్నుల విధానాన్ని అమలు చేశారని, ఎనిమిదేళ్ల తర్వాత తప్పును గ్రహించి...

P Chidambaram: 8 ఏళ్ల తర్వాత తప్పు దిద్దుకున్నారు

  • ఒకే దేశం ఒకే పన్ను పేరిట ఇప్పటిదాకా 9 పన్నులు వేశారు: ఖర్గే

న్యూఢిల్లీ, సెప్టెంబరు 4: ‘ఒకే దేశం ఒకే పన్ను’ పేరిట ఇప్పటి వరకూ ‘ఒకే దేశం 9 పన్నుల’ విధానాన్ని అమలు చేశారని, ఎనిమిదేళ్ల తర్వాత తప్పును గ్రహించి సరిదిద్దుకునే ప్రయత్నం చేశారని కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ మార్పులపై కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. కొత్త జీఎస్టీ శ్లాబులతో రాష్ట్రాలు ఆదాయాన్ని నష్టపోతున్నందున 2024-25 నుంచి ఐదేళ్లపాటు కేంద్రం పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేసింది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం ఎక్స్‌లో ఈ మేరకు స్పందిస్తూ.. చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను, ప్రజానీకాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన జీఎస్టీని సరళీకరించాలని తాము దాదాపు పదేళ్లుగా కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తున్నామని గుర్తు చేశారు. రైతుల మీద కూడా (36 రకాల వ్యవసాయ ఉపకరణాలపై) పన్ను వేశారని, దేశ చరిత్రలో రైతుల మీద పన్ను విధించటం ఇదే తొలిసారన్నారు. మొత్తం జీఎస్టీ రాబడిలో 64ు పేదలు, మధ్యతరగతి ప్రజల నుంచి వస్తోందని, కేవలం 3 శాతం మాత్రమే శత కోటీశ్వరుల నుంచి వస్తోందని, అయినప్పటికీ, మోదీ సర్కారు కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 30 నుంచి 22 శాతానికి తగ్గించి సంపన్నులకు మరింత లబ్ధి చేకూర్చిందని ఖర్గే దుయ్యబట్టారు. జీఎస్టీ సరళీకరణ, శ్లాబుల తగ్గింపు మంచి నిర్ణయమని, అయితే, దీనికి 8 ఏళ్లు ఎందుకు పట్టిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ ఆర్థికమంత్రి చిదంబరం ప్రశ్నించారు.

Updated Date - Sep 05 , 2025 | 04:55 AM