Share News

Karnataka Politics: సిద్దరామయ్య, శివకుమార్‌ ప్రత్యేకాధికారుల మధ్య గొడవ

ABN , Publish Date - Jul 27 , 2025 | 06:01 AM

కర్ణాటకలో ‘సీఎం మార్పు’ అంశంపై చర్చ కొనసాగుతూ..నే ఉన్న వేళ మరో వివాదం చర్చనీయాంశంగా మారింది.

Karnataka Politics: సిద్దరామయ్య, శివకుమార్‌ ప్రత్యేకాధికారుల మధ్య గొడవ

బెంగళూరు, జూలై 26 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో ‘సీఎం మార్పు’ అంశంపై చర్చ కొనసాగుతూ..నే ఉన్న వేళ మరో వివాదం చర్చనీయాంశంగా మారింది. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ప్రత్యేక అధికారుల (ఎస్‌డీవో) మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఇందుకు ఈనెల 22న ఢిల్లీలోని కర్ణాటక భవన్‌ వేదికైంది. సీఎం ఎస్‌డీవో మోహన్‌కుమార్‌ సిబ్బంది ఎదుటే తనను బూటుతో కొడతానని బెదిరించారని డీసీఎం ఎస్‌డీవో ఆంజనేయ ఆరోపించారు. ఆయన తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారని, అన్ని విషయాల్లో కలగజేసుకుంటున్నారని పేర్కొన్నారు. తన గౌరవానికి భంగం కలిగిందని పేర్కొంటూ ఆయన సీఎస్‌ శాలిని రజనీశ్‌ ఫిర్యాదు చేశారు. కుమార్‌ గతంలో కూడా పలువురు సీనియర్‌ అధికారులతో దురుసుగా ప్రవర్తించిన చరిత్ర ఉందని పేర్కొన్నారు. ఆంజనేయ ఫిర్యాదుపై విచారణకు సీఎస్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ఇంకాంగ్లో జమీర్‌ను ఆదేశించారు.

Updated Date - Jul 27 , 2025 | 07:08 AM