CJI Gavais Family Condemns: సీజేఐపై బూటు విసరడం.. రాజ్యాంగంపై దాడే!
ABN , Publish Date - Oct 09 , 2025 | 02:41 AM
సీజేఐ జస్టిస్ గవాయ్ లక్ష్యంగా కోర్టు హాలులో ఓ న్యాయవాది బూటు విసిరిన ఘటనను సీజేఐ కుటుంబ సభ్యులు ఖండించారు. ఈ ఘటనను రాజ్యాంగంపై...
జస్టిస్ గవాయ్ సోదరి, తల్లి వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, అక్టోబరు 8: సీజేఐ జస్టిస్ గవాయ్ లక్ష్యంగా కోర్టు హాలులో ఓ న్యాయవాది బూటు విసిరిన ఘటనను సీజేఐ కుటుంబ సభ్యులు ఖండించారు. ఈ ఘటనను రాజ్యాంగంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని చెప్పారు. ఇలాంటి విపరీత ప్రవర్తనలను కచ్చితంగా అడ్డుకోవాలని.. లేదంటే భావితరాలు మనల్ని క్షమించబోవని జస్టిస్ గవాయ్ సోదరి కీర్తి, తల్లి కమల అన్నారు. ప్రజలు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని కోరారు. న్యాయవాది రాకేశ్ కిశోర్ సీజేఐ లక్ష్యంగా బూటు విసరగా.. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దాన్ని అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన ఆయన సోదరి కీర్తి.. ఇలాంటి విపరీత ప్రవర్తన కలిగిన వారిని క్షమించకూడదని వీడియో ప్రకటనలో పేర్కొన్నారు. ఇది విషపూరిత సిద్ధాంతాలతో చేసిన దాడి అన్నారు.