Share News

USA-China trade war: చైనా నిర్ణయంతో భారత్‌కు మేలు!

ABN , Publish Date - Apr 17 , 2025 | 04:36 AM

అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో చైనా బోయింగ్‌ విమానాల దిగుమతిని నిలిపివేయాలని నిర్ణయించింది. దీనితో భారత్‌కు బోయింగ్‌ విమానాల అదనపు డెలివరీలు లభించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

USA-China trade war: చైనా నిర్ణయంతో భారత్‌కు మేలు!

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16: అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి బోయింగ్‌ విమానాల దిగుమతిని నిలిపివేయాలని చైనా భావించింది. అయితే.. ఈ నిర్ణయం భారత్‌కు కలిసొచ్చే అవకాశం ఉంది..! వాస్తవానికి చైనా విమానయాన సంస్థలు ప్రస్తుతం బోయింగ్‌ నుంచి సుమారు వంద బీ737 మ్యాక్స్‌ విమానాల డెలివరీ కోసం ఎదురుచూస్తున్నాయి. భారత్‌కు చెందిన ఎయిరిండియా ఎక్స్‌ప్రె్‌సతోపాటు ఆకాశ ఎయిర్‌ కూడా కొన్ని బీ787 డ్రీమ్‌లైనర్‌ విమానాల కోసం ఆర్డర్‌ పెట్టాయి. అయితే.. అమెరికా నుంచి బోయింగ్‌లు కొనుగోలు చేయకూడదని చైనా తీసుకున్న నిర్ణయంతో.. ఆ దేశం కోసం రూపొందించిన బోయింగ్‌ విమానాలను భారతీయ విమానయాన సంస్థలకు మళ్లించే అవకాశం ఉంది. ఈ క్రమంలో భారతీయ విమానయాన సంస్థలు బోయింగ్‌ నుంచి ఊహించని ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, ఆకాశ ఎయిర్‌లైన్స్‌ సహా పలు భారత విమానయాన సంస్థలకు అవి అడిగిన వాటికంటే అదనపు విమానాలు లభించే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఎయిరిండియా గతేడాది 25 మ్యాక్స్‌ విమానాలను కొనుగోలు చేసింది. మరికొన్ని విమానాలు రావాల్సి ఉంది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో ఇవి ఊహించినదానికంటే ముందే అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు బోయింగ్‌కు గుడ్‌బై చెప్పిన చైనా.. ఐరోపాకు చెందిన ఎయిర్‌బస్‌ వైపు మళ్లనుంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌బ్‌సలో అత్యంత ప్రజాదరణ పొందిన ఏ320 విమానాలకు డిమాండ్‌ పెరుగుతుందని భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

Rahul Gandhi: రెండు రకాల గుర్రాలు.. గుజరాత్‌లో కాంగ్రెస్ వ్యూహంపై రాహుల్

BR Gavai: తదుపరి సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్

Ranya Rao Gold Smuggling Case: బళ్లారి నగల వ్యాపారి బెయిలు తిరస్కరణ

Ramdev: రామ్‌దేవ్ 'షర్‌బత్ జిహాద్' వ్యాఖ్యలపై దిగ్విజయ్ కేసు

Updated Date - Apr 17 , 2025 | 04:36 AM