Char Dham: చార్‌ధామ్ యాత్ర ప్రారంభం
ABN , Publish Date - May 01 , 2025 | 05:03 AM
అక్షయ తృతియ సందర్భంగా యమునోత్రి, గంగోత్రి దేవాలయాలు తెరుచుకోవడంతో చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైంది. కేదార్‌నాథ్ శుక్రవారం, బద్రీనాథ్ ఆదివారం తెరుచుకోనున్నాయి.
ఉత్తరకాశీ/దెహ్రాదూన్, ఏప్రిల్ 30: అక్షయ తృతియ పర్వదినాన్ని పురస్కరించుకొని యమునోత్రి, గంగోత్రి దేవాలయాల తలుపులు భక్తుల కోసం తెరుచుకున్నాయి. దీంతో లక్షలాది మంది భక్తులు ఎదరుచూస్తున్న పవిత్ర చార్‌ధామ్ యాత్ర ప్రారంభమయింది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో యమునోత్రి, గంగోత్రి దేవాలయాలు ఉన్నాయి. కేదార్‌నాథ్ దేవాలయాన్ని శుక్రవారం, బద్రీనాథ్ దేవాలయాన్ని ఆదివారం తెరుస్తారు. చార్‌ధాయ్ యాత్ర ప్రారంభాన్ని పురస్కరించుకొని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఎక్స్‌లో భక్తులకు స్వాగతం పలికారు. చార్‌ధామ్ యాత్ర యమునోత్రితో ప్రారంభమై గంగోత్రి, కేదార్‌నాథ్‌ల మీదుగా సాగి బద్రినాథ్‌తో ముగుస్తుంది.
Also Read:
BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ
Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..
Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..