Share News

Undertrial prisoners: అలాంటి విచారణ ఖైదీలకు కేంద్ర ఆర్థిక సాయం ఉండదు!

ABN , Publish Date - Dec 19 , 2025 | 03:58 AM

విచారణ ఖైదీలుగా ఉండే పేదలకు కేంద్ర హోం శాఖ ఆర్థిక సాయం అందించే పథకం నుంచి కొందరిని తొలగించారు.

Undertrial prisoners: అలాంటి విచారణ ఖైదీలకు కేంద్ర ఆర్థిక సాయం ఉండదు!

  • దారుణమైన నేరాభియోగాలు ఎదుర్కొనే వారు అనర్హులు

  • మార్గదర్శకాలను సవరించిన కేంద్రం

న్యూఢిల్లీ, డిసెంబరు 18: విచారణ ఖైదీలుగా ఉండే పేదలకు కేంద్ర హోం శాఖ ఆర్థిక సాయం అందించే పథకం నుంచి కొందరిని తొలగించారు. దారుణమైన నేర అభియోగాలు ఎదుర్కొంటూ విచారణ ఖైదీలుగా ఉన్నవారికి ఈ పథకాన్ని వర్తింపజేయరాదని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలను సవరించింది. ‘‘ఉగ్రవాదం, జాతీయ భద్రతపై ప్రభావం చూపే నేరాలు, వరకట్న హత్యలు, అత్యాచారం, మానవ అక్రమ రవాణా, పోక్సో చట్టం కిందకు వచ్చే నేరాలు వంటి దారుణాలకు పాల్పడిన వ్యక్తులకు కేంద్ర హోం శాఖ పథకం వర్తించదు’’ అని సవరించిన మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. ప్రస్తుతం అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్‌ వ్యతిరేక చట్టం, ఎన్‌డీపీఎ్‌స, చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం పరిధిలోకి వచ్చే నేరాల అభియోగాలు ఎదుర్కొంటూ విచారణ ఖైదీలుగా ఉన్న వారికి ఈ పథకాన్ని వర్తింపజేయడం లేదు. తాజాగా మార్గదర్శకాలను సవరించారు.

Updated Date - Dec 19 , 2025 | 03:58 AM