Share News

Justice Yashwant Verma: జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై అభిశంసన తీర్మానం

ABN , Publish Date - Jul 10 , 2025 | 05:23 AM

ఇంట్లో పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్ల కట్టలు బయటపడడంతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్‌ న్యాయమూర్తి, జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.

Justice Yashwant Verma: జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై అభిశంసన తీర్మానం

  • పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే యోచనలో కేంద్రం

  • ప్రధాన పార్టీలతో సంప్రదింపులు

  • ఇప్పటికే మొదలైన ఎంపీల సంతకాల సేకరణ ప్రక్రియ

న్యూఢిల్లీ, జూలై 9: ఇంట్లో పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్ల కట్టలు బయటపడడంతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్‌ న్యాయమూర్తి, జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ తీర్మానానికి ప్రతిపక్షాల మద్దుతు లభిస్తుందని ఆశిస్తోంది. లోక్‌సభలో ఓ తీర్మానం ప్రవేశపెట్టాలంటే దానికి మద్దతుగా కనీసం 100 మంది ఎంపీలు సంతకాలు చేయాలి. ఈ సంతకాల సేకరణ ప్రక్రియ ఇప్పటికే మొదలైనట్టు సమాచారం.


ఈ ప్రక్రియ పూర్తయితే జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ వ్యవహారంలో విచారణకు ఓ కమిటీని ఏర్పాటు చేస్తారు. జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను పదవి నుంచి తప్పించేందుకు అవసరమైన తీర్మానానికి మద్దతు కోరుతూ ఉభయ సభల్లోని ప్రధాన పార్టీలతో కేంద్రం సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది.

Updated Date - Jul 10 , 2025 | 05:23 AM