Share News

Rajnath Singh: నాగ్‌ క్షిపణులు.. టార్పెడోలు

ABN , Publish Date - Oct 24 , 2025 | 05:50 AM

ఆపరేషన్‌ సిందూ ర్‌ తర్వాత భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. ఈ ఏడాది ఆగస్టులో రూ.67,000 కోట్ల విలువైన రక్షణ పరికరాల సేకరణ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన కేంద్రం..

Rajnath Singh: నాగ్‌ క్షిపణులు.. టార్పెడోలు

  • రూ.79 వేల కోట్లతో ఆయుధాల కొనుగోలుకు కేంద్రం ఆమోదం

  • రక్షణ రంగం బలోపేతం దిశగా మరో కీలక నిర్ణయం

న్యూఢిల్లీ, అక్టోబరు 23: ఆపరేషన్‌ సిందూ ర్‌ తర్వాత భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. ఈ ఏడాది ఆగస్టులో రూ.67,000 కోట్ల విలువైన రక్షణ పరికరాల సేకరణ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన కేంద్రం.. తాజాగా మరో రూ.79,000కోట్ల విలువైన ఆయుధాలు, సైనిక పరికరాలు, మిలిటరీ హార్డ్‌వేర్‌ కొనుగోలు ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన గురువారం జరిగిన డిఫెన్స్‌ అక్వైజిషన్‌ కౌన్సిల్‌ (డీఏసీ) సమావేశంలో.. ట్యాంక్‌ విధ్వంసక గైడెడ్‌ నాగ్‌-2 క్షిపణులు, ఉభయచర యుద్ధ నౌకలకు అవసరమైన ల్యాండింగ్‌ ప్లాట్‌ఫాం డాక్స్‌, అడ్వాన్స్‌డ్‌ లైట్‌ వెయిట్‌ టార్పెడోలు, ఎలకా్ట్రనిక్స్‌ ఇంటెలిజెన్స్‌, నిఘా వ్యవస్థలు సహా రూ.79,000 కోట్ల విలువైన ఆయుధాలు, సైనిక పరికరాల కొనుగోలు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత ఇంత భారీ మొత్తంలో రక్షణ పరికరాల సేకరణకు ఆమోదం తెలపడం ఇది రెండోసారి. భారత నావికా దళం కోసం.. ల్యాండింగ్‌ ప్లాట్‌ఫాం డాక్స్‌ (ఎల్‌పీడీ), 30 ఎంఎం నావల్‌ సర్ఫేస్‌ గన్స్‌ (ఎన్‌ఎ్‌సజీ), అడ్వాన్స్‌డ్‌ లైట్‌ వెయిట్‌ టార్పెడోలు (ఏఎల్‌డబ్ల్యూటీ), ఎలకో్ట్ర ఆప్టికల్‌ ఇన్‌ఫ్రా-రెడ్‌ సెర్చ్‌ అండ్‌ ట్రాక్‌ సిస్టమ్‌, 76 ఎంఎం సూపర్‌ ర్యాపిడ్‌ గన్‌మౌంట్‌ కోసం స్మార్ట్‌ మందుగుండు సామగ్రి కొనుగోలు చే యనున్నారు. ఎల్‌పీడీల సేకరణ వల్ల భారత నావికాదళం.. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌తో కలిసి ఉభయచర కార్యకలాపాలు చేపట్టేందుకు ఉపయోగపడతాయని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డీఆర్‌డీవో దేశీయంగా అభివృద్ధిచేసిన ఏఎల్‌డబ్ల్యూటీలకు సంప్రదాయ, అణు జలాంతర్గాములను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం ఉంది.


30 ఎంఎం ఎన్‌ఎస్‌జీలతో నేవీ, భారత తీరప్రాంత రక్షణ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇక భారత సైన్యం కోసం.. 2,408 యాంటీ ట్యాంక్‌ గైడెడ్‌ నాగ్‌ మార్క్‌-2 మిస్సైల్స్‌ (నామిస్‌), గ్రౌండ్‌ బేస్‌డ్‌ మొబైల్‌ ఎలకా్ట్రనిక్‌ ఇంటెలిజెన్స్‌ సిస్టమ్‌, హై మొబిలిటీ వెహికిల్స్‌ (హెచ్‌ఎంవీ) కొనుగోలు చేసేందుకు ఆమోదం లభించినట్టు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. నాగ్‌ మార్క్‌-2 క్షిపణులను సమకూర్చుకుంటే శత్రువుల పోరాట వాహనాలు, బంకర్లు, స్థావరాలను లక్ష్యంగా దాడులు చేయడానికి ఉపయోగపడతాయని, గ్రౌండ్‌ బేస్‌డ్‌ మొబైల్‌ ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ శత్రువు కార్యకలాపాలకు సంబంధించిన సమచారాన్ని 24 గంటలూ అందిస్తుందని రక్షణ శాఖ పేర్కొంది. అలాగే భారత వైమానిక దళం కోసం కొలాబరేటి వ్‌ లాంగ్‌ రేంజ్‌ టార్గెట్‌ సాచ్యురేషన్‌/డిస్ట్రక్షన్‌ సిస్టమ్‌ (సీఎల్‌ఆర్‌టీఎ్‌స/డీఎ్‌స)ను కొనుగోలుకు డీఏసీ ఆమోదం తెలిపింది.


380 పదాతిదళ బెటాలియన్లకు ‘ఆష్నీ’ డ్రోన్లు

భారత సైన్యంలోని 380 పదాతిదళ బెటాలియన్లను ‘ఆష్నీ’ డ్రోన్‌ ప్లాటూన్లతో అనుసంధానం చేసినట్టు పదాతిదళ డైరెక్టర్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అజయ్‌ కుమార్‌ తెలిపారు. ఉత్తర, పశ్చిమ సరిహద్దుల్లో సైన్యం పోరాట సామర్థ్యాన్ని పెంచేందుకు ఆధునీకరణలో భాగంగా ఎలైట్‌ కమాండో యూనిట్లను పెంచుతున్నామని చెప్పారు. పదాతిదళ ఆధునీకరణలో భాగంగా సైన్యం రూ.2,770 కోట్లతో 4.25 లక్షల తుపాకీలు కూడా కొనుగోలు చేయనుందని చెప్పారు. 380 పదాతిదళ బెటాలియన్లలో ప్రతి బెటాలియన్‌కూ ఒక ఆష్నీ డ్రోన్‌ ప్లాటూన్‌ను అందిస్తున్నామని, వాటి లో కనీసం నాలుగు నిఘా డ్రోన్లు కూడా ఉంటాయన్నారు.

Updated Date - Oct 24 , 2025 | 05:51 AM