Share News

Railway Line Doubling: బిహార్‌పై కేంద్రం వరాల జల్లు

ABN , Publish Date - Sep 11 , 2025 | 03:29 AM

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్‌పై కేంద్రం వరాల జల్లు కురిపించింది. న్యూఢిల్లీలో మోదీ..

Railway Line Doubling: బిహార్‌పై కేంద్రం వరాల జల్లు

  • రూ.4,447 కోట్లతో 4 లేన్ల హై స్పీడ్‌ కారిడార్‌కు ఆమోదం

  • రూ. 3,169 కోట్లతో రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులకు ఆమోదం

నూఢిల్లీ, సెప్టెంబరు 10: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్‌పై కేంద్రం వరాల జల్లు కురిపించింది. న్యూఢిల్లీలో మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర ఆర్ధిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ 2 కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.4,447 కోట్లతో బక్సర్‌-భగల్పూర్‌ హై స్పీడ్‌ కారిడార్‌లో భాగంగా మొకమా-ముంగేర్‌ సెక్షన్‌లో 4 లేన్ల కారిడార్‌ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. 82.4 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తారు. మరోవైపు రూ.3,169 కోట్లతో భగల్పూర్‌-డుమ్‌కా-రామ్‌పుర్‌హట్‌ రైల్వే లైన్‌ డబ్లింగ్‌ పనులకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

Updated Date - Sep 11 , 2025 | 03:29 AM