Share News

Central Government: అటవీ హక్కులపై జూన్‌లో అవగాహన కార్యక్రమాలు

ABN , Publish Date - May 14 , 2025 | 07:29 AM

కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కుల చట్టం పై జూన్ 1 నుంచి నెలంతా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ కార్యక్రమాల్లో గిరిజనులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించింది.

 Central Government: అటవీ హక్కులపై జూన్‌లో అవగాహన కార్యక్రమాలు

  • నెలంతా నిర్వహించాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

న్యూఢిల్లీ, మే13: అటవీ హక్కుల చట్టం (ఎఫ్‌ఆర్‌ఏ)పై అవగాహన కలిగించేందుకు జూన్‌ 1 నుంచి నెలంతా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ కార్యక్రమాల్లో గిరిజనులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొనేలా చూడాలని సూచించింది. అటవీ హక్కుల చట్టం అమలులో గ్రామసభల పాత్ర, పరిహారాలు పొందే విధానం, పట్టాల పంపిణీ, భూసార కార్డులు, పీఎం కిసాన్‌, ఆధార్‌ కార్డులు తదితర అంశాలపై అవగాహన కలిగించాలని పేర్కొంది. జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ, ఇతర శాఖల అధికార్లతో సమన్వయం చేసుకోవాలని తెలిపింది.

Updated Date - May 14 , 2025 | 07:29 AM