Central Government: ఆయుధ కర్మాగారాల సిబ్బంది సెలవుల రద్దు
ABN , Publish Date - May 03 , 2025 | 04:43 AM
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో, దేశవ్యాప్తంగా 41 ఆయుధ కర్మాగారాలు మరియు 7 ఆయుధ డిపోల్లో సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. భద్రతా చర్యల భాగంగా, ఆయుధ నిల్వలు సరిపడా ఉన్నాయని, ఉత్పత్తి పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.
న్యూఢిల్లీ, మే 2: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న 41 ఆయుధ కర్మాగారాలు, 7 ఆయుధ డిపోల్లో సిబ్బందికి సెలవులు రద్దు చేసింది. దేశ భద్రతా చర్యల్లో భాగంగా ఈ అత్యవసర ఆదేశాలు తక్షణమే అమలు చేయాలని సూచించింది. ఉద్యోగులంతా తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. మరోవైపు అన్ని కర్మాగారాలు, డిపోల్లో రానున్న నెలలకు సరిపడా ఆయుధ నిల్వలున్నాయని, అవసరమైతే ఉత్పత్తి పెంచడానికి సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. సరిహద్దులకు సరిపడా ఆయుధాలను తరలించినట్లు తెలిపాయి.
ఇవి కూడా చదవండి..