Share News

Pahalgam: మీడియా సంయమనం పాటించాలి

ABN , Publish Date - Apr 27 , 2025 | 01:19 AM

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో, మీడియా సంస్థలు ప్రసారాల్లో బాధ్యతగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. సైనిక కార్యకలాపాలపై ప్రత్యక్ష ప్రసారాలు చేయరాదని, జాతీయ భద్రత కోసం నిబంధనలు పాటించాలని మార్గదర్శకాలు విడుదల చేసింది.

Pahalgam: మీడియా సంయమనం పాటించాలి

సైనిక కార్యకలాపాలపై ప్రత్యక్ష ప్రసారాలు వద్దు: కేంద్రం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): పహల్గాం ఉగ్రవాద దాడితో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో.. మీడియా సంస్థలు ప్రసారాల విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. జాతీయ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా.. సైనిక కార్యకలాపాలకు సంబంధించిన వార్తలు ఇచ్చేటప్పుడు చట్టాలు, నిబంధనలు పాటించాలని పేర్కొంది. విశ్వసనీయ వర్గాల సమాచారం పేరుతో వివరాలు వెల్లడించరాదని, భద్రతా దళాల కదలికలపై ప్రత్యక్ష ప్రసారాలు చేయవద్దని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ.. మీడియా సంస్థలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. సున్నితమైన సమాచారాన్ని ముందుగానే వెల్లడించడం వల్ల శత్రువర్గాలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుందని, సిబ్బంది భద్రతకు, ఆపరేషన్ల సమర్థతకు ముప్పు వాటిల్లవచ్చని పేర్కొంది. కార్గిల్‌ యుద్ధం, ముంబయిలో ఉగ్రదాడులు, కాందహార్‌ హైజాకింగ్‌ వంటి ఘటనలు జరిగినప్పుడు ఎటువంటి ఆంక్షలు లేకుండా సమాచారాన్ని ప్రసారం చేయడం వల్ల జాతీయ ప్రయోజనాలకు నష్టం వాటిల్లిందని గుర్తు చేసింది.


ఇవి కూడా చదవండి:

పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. అంతలోనే విషాదం..

Seema Haider: పాకిస్తాన్ తిరిగి వెళ్లటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీమా హైదర్

Updated Date - Apr 27 , 2025 | 01:19 AM