Board Exams: ఫిబ్రవరి 17 నుంచి 10, 12 తరగతుల పరీక్షలు
ABN , Publish Date - Oct 31 , 2025 | 03:24 AM
వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలు ప్రారంభమవుతాయని కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎ్‌సఈ) గురువారం ప్రకటించింది...
బోర్డు పరీక్షల షెడ్యూల్ వెల్లడించిన సీబీఎ్‌సఈ
న్యూఢిల్లీ, అక్టోబరు 30: వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 నుంచి 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలు ప్రారంభమవుతాయని కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎ్‌సఈ) గురువారం ప్రకటించింది. మార్చి 10న 10వ తరగతి, ఏప్రిల్ 9న 12వ తరగతి పరీక్షలు ముగుస్తాయని తెలిపింది. సీబీఎ్‌సఈ 10వ, 12 తరగతి బోర్డు పరీక్షల నిర్వహణ తేదీలను 110 రోజుల ముందే ప్రకటించడం ఇదే తొలిసారి. అలాగే, ఈ విద్యా సంవత్సరం నుంచే రెండు దఫాలు 10వ తరగతి బోర్డు పరీక్షలు నిర్వహించడం ఇదే ప్రథమం. రెండో దఫా 10వ తరగతి బోర్డు పరీక్షలు మే 15 నుంచి జూన్ ఒకటో తేదీ వరకూ నిర్వహించడంతోపాటు రెండు సబ్జెక్టుల మధ్య విద్యార్థుల ప్రిపరేషన్‌కు మరో రోజు అదనపు సమయం ఇస్తున్నట్లు సీబీఎ్‌సఈ తెలిపింది.