Share News

BRS: బీఆర్‌ఎస్‌.. సంపన్న పార్టీ!

ABN , Publish Date - Sep 11 , 2025 | 03:55 AM

దేశంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీల్లో తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి..

BRS: బీఆర్‌ఎస్‌.. సంపన్న పార్టీ!

  • 2023-24 ఆర్థిక సంవత్సరంలోరూ.685 కోట్ల విరాళాలు

  • దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో ఫస్ట్‌ ప్లేస్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 10: దేశంలోని ప్రాంతీయ రాజకీయ పార్టీల్లో తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) అత్యంత సంపన్న పార్టీగా నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. ప్రాంతీయ పార్టీలు వెల్లడించిన ఆదాయాలపై అధ్యయనం చేసిన ఏడీఆర్‌ తాజాగా వెలువరించిన నివేదికలో ఈ మేరకు పేర్కొంది. దేశంలోని తొలి 5 సంపన్న ప్రాంతీయ పార్టీల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 3 పార్టీలు చోటు దక్కించుకున్నాయి. వీటిలో బీఆర్‌ఎస్‌ రూ.685.51 కోట్ల ఆదాయంతో తొలిస్థానంలో ఉండగా, ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం(టీడీపీ) రూ.285.07 కోట్లతో నాలుగోస్థానంలోను, ఏపీ విపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీ రూ.191.04 కోట్లతో ఐదోస్థానంలో నిలిచింది. ఇక, పశ్చిమబెంగాల్‌ అధికార పార్టీ టీఎంసీ రూ.646.39 కోట్లతో రెండోస్థానంలోను, ఒడిశా ప్రధాన ప్రతిపక్షం బీజేడీ రూ.297.81 కోట్లతో మూడోస్థానంలోను నిలిచింది. 2023-24 మధ్య దాదాపు 40 ప్రాంతీయ పార్టీల ఆదాయం రూ.2,532.09 కోట్లుగా ఉందని నివేదిక తెలిపింది. ఈ మొత్తం ఆదాయంలో తొలి ఐదుస్థానాల్లో ఉన్న పార్టీల వాటా 83.17ు ఉంది.

Updated Date - Sep 11 , 2025 | 03:55 AM