Supreme Court: సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్‌లు అరాధే, పంచోలీ
ABN , Publish Date - Aug 29 , 2025 | 05:06 AM
బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపుల్ మనుభాయి పంచోలికు సుప్రీం కోర్టు
పదోన్నతులపై కొలీజియం సిఫారసుకు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ, ఆగస్టు 28: బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విపుల్ మనుభాయి పంచోలికు సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించింది. వీరి పదోన్నతులకు సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసును కేంద్రం ఆమోదించింది. ఇందుకు సంబంధించి కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘావల్.. ఎక్స్‌లో బుధవారం పోస్టు చేశారు.