VV Rajesh Elected Mayor: సీపీఎం కంచుకోటలో కాషాయ పతాకం
ABN , Publish Date - Dec 27 , 2025 | 03:43 AM
నాలుగు దశాబ్దాలుగా సీపీఎం కంచుకోటగా ఉన్న తిరువనంతపురం నగరంలో ఇప్పుడు కాషాయ పతాకం ఎగురుతోంది.
త్రివేండ్రం కొత్త మేయర్‌గా బీజేపీ నేత వీవీ రాజేశ్ ఎన్నిక
తిరువనంతపురం, డిసెంబరు 26: నాలుగు దశాబ్దాలుగా సీపీఎం కంచుకోటగా ఉన్న తిరువనంతపురం నగరంలో ఇప్పుడు కాషాయ పతాకం ఎగురుతోంది. ఇటీవలి ఎన్నికల్లో 101 వార్డుల కార్పొరేషన్‌లో 100 స్థానాలకు ఎన్నికలు జరుగగా.. బీజేపీ 50 స్థానాలు గెలుచుకుంది. సీపీఎం సారథ్యంలోని ఎల్‌డీఎఫ్ 29, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 21, ఇండిపెండెంట్లు రెండు చోట్ల గెలిచారు. నగర మేయర్‌గా బీజేపీ తరఫున ఆ పార్టీ నేత వీవీ రాజేశ్ బరిలో నిలువగా.. ఆయనకు 51 ఓట్లు లభించాయి. ఎల్‌డీఎఫ్ అభ్యర్థి శివాజీకి 29, యూడీఎఫ్ అభ్యర్థి కేఎస్ శబరినాథన్‌కు 19 ఓట్లు వచ్చాయి. రాజేశ్‌కు ఒక స్వతంత్రుడు మద్దతిచ్చారు. రెండో ఇండిపెండెంట్ ఓటింగ్‌లో పాల్గొనలేదు. కేంద్ర మంత్రి సురేశ్ గోపి తదితరుల సమక్షంలో రాజేశ్ మేయర్‌గా పదవీప్రమాణం చేశారు. డిప్యూటీ మేయర్‌గా బీజేపీ మహిళా కౌన్సిలర్ జీఎస్ ఆశానాథ్ ఎంపికయ్యారు. రాష్ట్రంలో త్రిపునిథుర, పాలక్కాడ్ మున్సిపాలిటీలను కూడా బీజేపీ చేజిక్కించుకుంది. పాలక్కాడ్‌లో హ్యాట్రిక్ సృష్టించింది.