Share News

BJP Holds Massive Funds: కాంగ్రెస్‌ ఖాతాలో రూ.53 కోట్లు బీజేపీ ఖాతాలో రూ.6,900 కోట్లు

ABN , Publish Date - Dec 24 , 2025 | 04:10 AM

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బ్యాంకు ఖాతాలో రూ.6,900 కోట్లకు పైగా నిధులున్నాయి. దాని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ ఖాతాలో...

BJP Holds Massive Funds: కాంగ్రెస్‌ ఖాతాలో రూ.53 కోట్లు బీజేపీ ఖాతాలో రూ.6,900 కోట్లు

న్యూఢిల్లీ, డిసెంబరు 23: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బ్యాంకు ఖాతాలో రూ.6,900 కోట్లకు పైగా నిధులున్నాయి. దాని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ ఖాతాలో మాత్రం రూ.53 కోట్ల నిల్వలే ఉన్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘానికి వివిధ రాజకీయ పార్టీలు తమ బ్యాంకు ఖాతాల్లో నిధుల వివరాలు వెల్లడించాయి. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలతోపాటు కేంద్రం, రాష్ట్రాలు, జిల్లా కమిటీలు గల బీఎస్పీ బ్యాంకు ఖాతాలో రూ.580 కోట్లపై చిలుకు డిపాజిట్లు ఉండటం ఆసక్తికర పరిణామం. ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) రూ.9.9 కోట్లు, సీపీఐ (ఎం) రూ.4 కోట్లు, సీపీఐ రూ.41 లక్షల నిల్వలు కలిగి ఉన్నాయి. గత అక్టోబరులో ఈసీకి సమర్పించిన ఫైలింగ్‌లో 2024-25లో రూ.517 కోట్ల నిధులు సమకూరాయని కాంగ్రెస్‌ తెలిపింది. వాటిలో రూ.20 వేలకంటే ఎక్కువగా వచ్చిన విరాళాల వివరాలను వెల్లడించింది. పలు పార్టీలు వ్యక్తులు, కార్పొరేట్‌ సంస్థలు, ట్రస్టులతోపాటు వివిధ మార్గాల్లో విరాళాలు సేకరిస్తాయి.

Updated Date - Dec 24 , 2025 | 04:10 AM