Share News

Former MP Pragya Singh Thakur: మాలేగావ్‌ కేసులో మోదీ పేరు చెప్పాలన్నారు

ABN , Publish Date - Aug 03 , 2025 | 06:19 AM

మాలేగావ్‌ పేలుళ్ల కేసులో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి, ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌, బీజేపీ నేత రామ్‌ మాధవ్‌ పేర్లు చెప్పాలని తనను ఏటీఎస్‌ అధికారులు హింసించారని...

Former MP Pragya Singh Thakur: మాలేగావ్‌ కేసులో మోదీ పేరు చెప్పాలన్నారు

  • యోగి, భాగవత్‌ పేర్ల కోసం హింసించారు: ప్రజ్ఞాసింగ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 2: మాలేగావ్‌ పేలుళ్ల కేసులో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి, ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌, బీజేపీ నేత రామ్‌ మాధవ్‌ పేర్లు చెప్పాలని తనను ఏటీఎస్‌ అధికారులు హింసించారని బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ ఆరోపించారు. ఈ పేర్లు చెబితే తనను హింసించబోమని మాటిచ్చారని ఆమె చెప్పారు. తనపై తప్పుడు ఆరోపణలతో కేసు పెట్టారని, ఇదంతా కాంగ్రెస్‌ కుట్రగా ప్రస్తుతం బహిర్గతమైందన్నారు. ఈ కేసులో తనతో సహా ఆరోపణలు ఎదుర్కొన్నవారంతా నిర్దోషులుగా బయటపడటం కాషాయానికి, సనాతన ధర్మానికి లభించిన విజయమని ఆమె చెప్పారు. ఈ కేసులో ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ను అరెస్ట్‌ చేయాలని తనపై ఒత్తిడి తెచ్చారని ఏటీఎస్‌ అధికారి మహబూబ్‌ ముజావ్‌ ఇటీవలే ఆరోపించారు.

Updated Date - Aug 03 , 2025 | 06:20 AM