Share News

Bilawal Bhutto remarks: మా నీళ్లు రాకపోతే.. వారి రక్తం ప్రవహిస్తుంది

ABN , Publish Date - Apr 27 , 2025 | 01:06 AM

సింధు జలాల ఒప్పందం రద్దుపై బిలావల్ భుట్టో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. 이에 కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ తీవ్రంగా స్పందిస్తూ ఆయనను మూర్ఖుడిగా అభివర్ణించారు.

Bilawal Bhutto remarks: మా నీళ్లు రాకపోతే.. వారి రక్తం ప్రవహిస్తుంది

పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ చీఫ్‌ బిలావల్‌ భుట్టో ప్రేలాపనలు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని భారత్‌ రద్దు చేయడంపై పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) చీఫ్‌ బిలావల్‌ భుట్టో జర్దారీ నోరు పారేసుకున్నారు. నదిలో నీరు పారకపోతే వారి నెత్తురు ప్రవహిస్తుందంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సింధు నాగరికతకు తామే నిజమైన సంరక్షకులమని ప్రకటించుకున్నారు. శుక్రవారం ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడారు. ‘సింధు నది మనది.. ఇకముందు కూడా మనదిగానే ఉంటుంది. దానిలో నీళ్లు ప్రవహిస్తాయి. లేకపోతే వారి రక్తం పారుతుంది’ అన్నారు. ఈ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి హర్దీ్‌పసింగ్‌ తీవ్రంగా స్పందించారు. బిలావల్‌ ఒక మూర్ఖుడన్నారు.


ఇవి కూడా చదవండి:

పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. అంతలోనే విషాదం..

Seema Haider: పాకిస్తాన్ తిరిగి వెళ్లటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీమా హైదర్

Updated Date - Apr 27 , 2025 | 01:06 AM