Share News

Bihar Govt: బిహార్‌లో జర్నలిస్టుల పెన్షన్‌ 15 వేలకు పెంపు

ABN , Publish Date - Jul 27 , 2025 | 06:23 AM

అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిహార్‌ ప్రభుత్వం జర్నలిస్టులకు శుభవార్త తెలిపింది.

Bihar Govt: బిహార్‌లో జర్నలిస్టుల పెన్షన్‌ 15 వేలకు పెంపు

పట్నా, జూలై 26: అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిహార్‌ ప్రభుత్వం జర్నలిస్టులకు శుభవార్త తెలిపింది. వారికి అందిస్తున్న నెలవారీ పింఛనును రూ.9వేల మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. ‘బిహార్‌ పత్రికార్‌ సమ్మాన్‌’ పింఛన్‌ పథకం కింద ఇప్పటివరకు రూ.6 వేలు పొందుతున్న జర్నలిస్టులకు ఇకపై రూ.15 వేల పింఛను లభించనుంది. పింఛను తీసుకుంటున్న జర్నలిస్టు మరణించిన సందర్భంలో జీవిత భాగస్వామికి లేదా ఆ జర్నలిస్టుపై ఆధారపడిన వ్యక్తికి ఇప్పటివరకు ఇస్తున్న రూ.3 వేల పెన్షన్‌ కూడా రూ.10వేలకు పెంచుతున్నట్లు సీఎం నితీశ్‌ ప్రకటించారు.

Updated Date - Jul 27 , 2025 | 06:25 AM