Bihar Assembly Election: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడే
ABN , Publish Date - Nov 14 , 2025 | 03:57 AM
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఈవీఎంల్లో ఓటర్లు నిక్షిప్తం చేసిన తీర్పు శుక్రవారం వెలువడనుంది....
పట్నా, నవంబరు 13: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఈవీఎంల్లో ఓటర్లు నిక్షిప్తం చేసిన తీర్పు శుక్రవారం వెలువడనుంది. 243 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీగా 67.13ు పోలింగ్ నమోదైంది. 2020 ఎన్నికల్లో 57.29 శాతం ఓటింగ్ జరిగింది. దరిదాపుగా పది శాతం అధికంగా పోలింగ్ నమోదు కావడంతో.. విజయంపై పాలక ఎన్‌డీఏ, విపక్ష మహాగఠ్‌బంధన్ ధీమాతో ఉన్నాయి. సీఎం నితీశ్‌కుమార్ సారథ్యంలోని ఎన్‌డీఏదే మళ్లీ గెలుపని ఎగ్జిట్ పోల్ సర్వేలు పేర్కొన్నాయి. ప్రతిపక్షాలు మాత్రం తోసిపుచ్చుతున్నాయి. 2,616 మంది అభ్యర్థులు పోటీచేయగా.. సుమారు 7.45 కోట్ల మంది ఓటర్లలో 67.13 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.