First Woman Flight Engineer: బీఎస్ఎఫ్‌లో తొలి మహిళాఫ్లైట్ ఇంజనీరుగా భావనా చౌదరి
ABN , Publish Date - Oct 13 , 2025 | 06:25 AM
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)లో తొలి మహిళా ఫ్లైట్ ఇంజినీరుగా...
న్యూఢిల్లీ, అక్టోబరు 12: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)లో తొలి మహిళా ఫ్లైట్ ఇంజినీరుగా ఇన్‌స్పెక్టర్ భావనా చౌదరి నియమితులయ్యారు. బీఎస్ఎఫ్‌లో విమాన విభాగం 1969లో ఏర్పాటు కాగా, ఇంజినీరు పదవిలో మహిళను నియమించడం ఇదే ప్రథమం. నలుగురు పురుషులతో పాటు శిక్షణ పొందిన భావనకు ఇటీవలే బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ చౌదరి ఫ్లయింగ్ బ్యాడ్జెస్‌ను అందజేశారు.