Bharat Taxi Services: జనవరి 1 నుంచి ఢిల్లీలో భారత్ ట్యాక్సీ సేవలు
ABN , Publish Date - Dec 18 , 2025 | 02:19 AM
ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ప్రైవేటు క్యాబ్ సేవలకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ‘భారత్ ట్యాక్సీ’ పేరుతో సరికొత్త యాప్‌ను తీసుకువచ్చింది.....
న్యూఢిల్లీ, డిసెంబరు 17: ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ప్రైవేటు క్యాబ్ సేవలకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ‘భారత్ ట్యాక్సీ’ పేరుతో సరికొత్త యాప్‌ను తీసుకువచ్చింది. దేశంలో తొలిసారిగా ప్రారంభించిన ఈ సహకార ట్యాక్సీ సేవలు జనవరి 1 నుంచి ఢిల్లీ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ అనే సంస్థ నిర్వహిస్తున్న ఈ యాప్ పూర్తిగా జీరో కమీషన్ మోడల్‌పై ఆధారపడి పనిచేస్తుంది. కార్లు, ఆటోలు, బైకులు ఈ సేవలో అందుబాటులో ఉంటాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ వేదికలపై ఈ యాప్‌ను వినియోగించవచ్చు. ఢిల్లీ పోలీస్ సహా ఇతర భద్రతా సంస్థలతో అనుసంధానం, డ్రైవర్ల ధ్రువీకరణ, రైడ్ వివరాలు పంచుకోవడం వంటి అనేక సదుపాయాలు ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. అత్యవసర సమయాల్లో క్యాబ్ అగ్రిగేటర్లు విధిస్తున్న అధిక ధరలను నియంత్రించడమే లక్ష్యంగా ఈ యాప్‌ను రూపొందించారు.