DK Shivakumar: బెంగళూరులో గుంతలు పెద్ద సమస్య కాదు
ABN , Publish Date - Sep 20 , 2025 | 04:07 AM
పారిశ్రామికవేత్తలు ఎవరైనా బెంగళూరును వీడాలని అనుకుంటే వెళ్లిపోవచ్చని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. నాసిరకం రహదారుల...
‘బ్లాక్ బక్’ వివాదంపై కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్
బెంగళూరు, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): పారిశ్రామికవేత్తలు ఎవరైనా బెంగళూరును వీడాలని అనుకుంటే వెళ్లిపోవచ్చని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. నాసిరకం రహదారుల కారణంగా ఇబ్బంది పడుతున్నామని, బెంగళూరును వీడతామని బ్లాక్ బక్ కంపెనీ సీఈవో రాజేశ్ యబాది ఎక్స్‌లో పెట్టిన పోస్టు, తదనంతర పరిణామాలపై ఆయన గురువారం స్పందించారు. వర్షాల వల్ల ఏర్పడిన గుంతల విషయంలో కుట్రలు జరుగుతున్నాయని, విద్యార్థులతో కొందరు ప్రధానికి లేఖలు రాయిస్తారని అన్నారు. బెంగళూరులో గుంతలు పెద్ద సమస్య కాదని, కానీ ఇదే పెద్ద సమస్య అన్నట్లు వ్యవహరిస్తున్నారని శివకుమార్ తెలిపారు.