Indian Army: మానవ జీపీఎస్ బాగూఖాన్ హతం
ABN , Publish Date - Aug 31 , 2025 | 06:42 AM
చొరబాట్లలో కీలకంగా వ్యవహరిస్తూ ఉగ్రవాద శ్రేణుల్లో మానవ జీపీఎస్‌గా పేరు తెచ్చుకున్న బాగూఖాన్ అలియాస్ సమందర్ చాచాను భద్రతా దళాలు ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టాయి.
న్యూఢిల్లీ, ఆగస్టు 30: చొరబాట్లలో కీలకంగా వ్యవహరిస్తూ ఉగ్రవాద శ్రేణుల్లో మానవ జీపీఎస్‌గా పేరు తెచ్చుకున్న బాగూఖాన్ అలియాస్ సమందర్ చాచాను భద్రతా దళాలు ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టాయి. జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా ప్రాంతంలోకి మరో ఉగ్రవాదితో కలిసి అతడు చొరబడగా.. నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతా దళాలు వారిని చుట్టుముట్టాయి. ఇది గమనించి వారు కాల్పులకు తెగబడగా ఎదురు కాల్పులు జరిపి హతమార్చాయి. బాగూఖాన్ ఎన్‌కౌంటర్‌తో ఉగ్ర సంస్థల నెట్‌వర్క్‌కు గట్టి దెబ్బ తగిలినట్లయింది.