Share News

Assam CM Himanta Biswa Sarma: అత్యంత వేగంగా అసోం అభివృద్ధి

ABN , Publish Date - Dec 03 , 2025 | 04:23 AM

ఒకప్పుడు తీవ్రవాద కార్యకలాపాలతో అట్టుడికిన అసోం.. ఇప్పుడు దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు...

Assam CM Himanta Biswa Sarma: అత్యంత వేగంగా అసోం అభివృద్ధి

  • దశాబ్ద కాలంగా శాంతియుత వాతావరణం

  • రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చాయి

  • తెలంగాణ మీడియా ప్రతినిధులతో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ

ఒకప్పుడు తీవ్రవాద కార్యకలాపాలతో అట్టుడికిన అసోం.. ఇప్పుడు దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ఏడు రోజుల అసోం పర్యటనకు వెళ్లిన తెలంగాణ మీడియా బృందం మంగళవారం అసోం ముఖ్యమంత్రిని కలిసింది. గువాహటిలోని సీఎం అధికారిక నివాసంలో జరిగిన భేటీలో అసోంలో శాంతి భద్రతలు, అభివృద్ధి, పెట్టుబడులు, ఆరోగ్యం, మహిళా సాధికారత వంటి అంశాలపై ఆయన మాట్లాడారు. దశాబ్దాల పాటు తీవ్రవాద కార్యకలాపాలతో అల్లాడిన అసోంలో... ఒక దశాబ్ద కాలంగా పూర్తి శాంతియుత వాతావరణం నెలకొందని గుర్తు చేశారు. ఈ కారణంగానే రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని వివరించారు. ఎరువులు, ఎథనాల్‌ ఉత్పత్తి యూనిట్లు, సెమీకండక్టర్‌ ప్లాంట్‌ వంటి మెగా ప్రాజెక్టులతో రూ 4-5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని తెలిపారు. గత ఏడాది మూలధన పెట్టుబడుల్లో 36ు వృద్ధి నమోదైందని, ఐదేళ్లలో యువతకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో 6ు ఆరోగ్య రంగానికి కేటాయిస్తున్నట్లు చెప్పారు. ‘ఒక జిల్లాకు ఒక మెడికల్‌ కాలేజీ’ అనే లక్ష్యంతో ఇప్పటికే 15 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశామని, మరో 10 నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. టాటా ట్రస్ట్‌తో భాగస్వామ్యం తో 17 క్యాన్సర్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. మహిళా సాధికారత కోసం విశేషంగా కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో బహు భార్య త్వ నిషేధ బిల్లు త్వరలోనే అమలులోకి రానుందని, దీనికి అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అమ్మాయిల చదువుకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

Updated Date - Dec 03 , 2025 | 04:23 AM