Share News

AP Bhavan: ఏపీ భవన్‌లో ప్రత్యేక సెల్‌

ABN , Publish Date - Sep 10 , 2025 | 04:00 AM

నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. ఆ దేశంలో చిక్కుకున్న తెలుగు వారి తక్షణ సహాయార్థం ఏపీ ప్రభుత్వం న్యూఢిల్లీలోని...

AP Bhavan: ఏపీ భవన్‌లో ప్రత్యేక సెల్‌

న్యూఢిల్లీ/శ్రీకాకుళం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. ఆ దేశంలో చిక్కుకున్న తెలుగు వారి తక్షణ సహాయార్థం ఏపీ ప్రభుత్వం న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో అత్యవసర సెల్‌ను ఏర్పాటు చేసింది. పర్యాటకం నిమిత్తం నేపాల్‌కు వెళ్లి అక్కడి హోటళ్లలో చిక్కుకుపోయిన తెలుగు పౌరుల సహాయార్థం ఈ సెల్‌ పనిచేస్తుంది. సహాయం కోసం +91 9818395787 నంబరులో సంప్రదించవచ్చని తెలిపింది. మానస సరోవర్‌ యాత్రకు వెళ్లి నేపాల్‌లో చిక్కుకుపోయిన తెలుగువారు ఆందోళన చెందవద్దని, తాము అండగా ఉంటామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ భరోసా ఇచ్చారు. మరోవైపు, నేపాల్‌ పరిణామాలపై భారత్‌ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేసింది. హింస నేపథ్యంలో నేపాల్‌లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని కోరింది.

Updated Date - Sep 10 , 2025 | 04:00 AM