Amritsar Hooch Tragedy: 21కి చేరిన మృతుల సంఖ్య.. పంజాబ్‌లో పెను విషాదం
ABN , Publish Date - May 13 , 2025 | 08:27 PM
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో చోటు చేసుకున్న ఘోర విషాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరింది. ఆ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది.
పంజాబ్ (Punjab)లోని అమృత్‌సర్‌లో చోటు చేసుకున్న ఘోర విషాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. కల్తీ మద్యం తాగిన ఘటనలో మృతుల సంఖ్య 21కి చేరింది. ఆ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది. సోమవారం అమృత్‌సర్ మజితా బ్లాక్‌లోని భంగాలి కలన్, తారీవాల్, సంఘ, మరారి కలన్ గ్రామాలకు చెందిన కొంతమంది ప్రజలు మద్యం తాగిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే (Amritsar Hooch Tragedy).
ఆ బాధితులందరినీ అమృత్‌సర్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. వారిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయానికి 14 మంది చనిపోయారు. తాజాగా ఆ సంఖ్య 21కి చేరింది. ఘటన జరిగిన వెంటనే సంబంధిత అధికారులు, పోలీసులు ఆయా గ్రామాలకు చేరుకున్నారు. బాధితులను ఆస్పత్రికి తరలించారు. అనారోగ్య లక్షణాలు ఉన్నా, లేకపోయినా మద్యం తాగిన వారందరినీ ఆస్పత్రికి తరలించారు. ఆ మద్యం తయారీలో భారీగా మిథనాల్‌ను ఉపయోగించినట్టు తెలుసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి 9 మందిని అరెస్ట్ చేశారు. నలుగురు అధికారులను విధుల నుంచి తొలగించారు. జిల్లాకు చెందిన డీఎస్పీని, ఎక్సైజ్, టాక్సేషన్ అధికారి సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..