Share News

Amar Subramanya: ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా అమర్‌

ABN , Publish Date - Dec 03 , 2025 | 03:16 AM

ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌గా భారత సంతతికి చెందిన అమర్‌ సుబ్రమణ్య నియమితులయ్యారు....

Amar Subramanya: ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా అమర్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 2: ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌గా భారత సంతతికి చెందిన అమర్‌ సుబ్రమణ్య నియమితులయ్యారు. ఈ మేరకు ఆపిల్‌ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆపిల్‌ సంస్థకు చెందిన కృత్రిమ మేధ విభాగమే ఈ ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ. అయితే, తమ ఫోన్ల కోసం సమర్థమంతమైన సొంత జనరేటివ్‌ ఏఐ వ్యవస్థను నిర్మించుకోవడంలో ఆపిల్‌ వెనకబడిపోయిందన్న విమర్శలున్నాయి. ఏఐ రంగంలో గూగుల్‌, ఓపెన్‌ ఏఐ నుంచి తీవ్ర పోటీ నెలకొన్న వేళ అమర్‌ నియామకం ప్రాధాన్యం సంతరించుకొంది. అమర్‌ ఏఐలో నిష్ణాతుడు. అంతకుముందు గూగుల్‌లో పనిచేశారు. గూగుల్‌ జనరేటివ్‌ ఏఐ చాట్‌బాట్‌ ‘జెమిని’ రూపకల్పనలో కూడా పాలుపంచుకున్నారు. జూన్‌లో ఆ సంస్థకు రాజీనామా చేశారు. కాగా, అమర్‌ 2001లో బెంగళూరు యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్‌ పూర్తి చేశారు. తర్వాత ఐబీఎంలో చేరారు. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడ్డారు.

Updated Date - Dec 03 , 2025 | 03:16 AM