Share News

Group1 Mains: గ్రూప్‌-1పై సందేహాలను వారంలో నివృత్తి చేయండి

ABN , Publish Date - May 01 , 2025 | 04:31 AM

గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాల్లో జరిగిన అక్రమాలపై అభ్యర్థుల ఆందోళనలతో టీజీపీఎస్సీ స్పష్టత ఇవ్వాలని బండి సంజయ్‌ కోరారు. ఉర్దూ మీడియం, కోఠీ ఉమెన్స్‌ కాలేజీ అభ్యర్థులు టాపర్లవడం వెనుక మతలబేమిటో వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Group1 Mains: గ్రూప్‌-1పై సందేహాలను వారంలో నివృత్తి చేయండి

టీజీపీఎస్సీ చైర్మన్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ లేఖ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 మెయిన్స్‌ ఫలితాల్లో అక్రమాలు జరిగాయని అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో వారి సందేహాలకు వారంలో సమగ్ర సమాచారమివ్వాలని టీజీపీఎస్సీ చైర్మన్‌ బుర్రా వెంకటేశంను కేంద్రమంత్రి బండి సంజయ్‌ కోరారు. ఉర్దూ మీడియంలో రాసిన, కోఠీ ఉమెన్స్‌ కాలేజీలో రాసిన అభ్యర్థులకే టాప్‌ ర్యాంకులు రావడం వెనకున్న మతలబేంటని ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం ఆయనకు లేఖ రాశారు. మరోవైపు హైకోర్టులో గ్రూప్‌-1పై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో టీజీపీఎస్సీ సమాచారం ఆధారంగా అవసరమైతే తాను కేసులో ఇంప్లీడ్‌ కావాలని నిర్ణయించినట్టు సంజయ్‌ పేర్కొన్నారు.


Also Read:

BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్‌ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ

Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..

Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..

Updated Date - May 01 , 2025 | 04:31 AM