Akhilesh Yadav: దీపాలు, కొవ్వొత్తులపై ఖర్చు ఎందుకు?
ABN , Publish Date - Oct 20 , 2025 | 03:58 AM
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ దీపావళి ఉత్సవాల సందర్భంగా దీపాలు, కొవ్వొత్తులపై చేసే ఖర్చుతోపాటు క్రిస్మస్ వేడుకల నుంచి నేర్చుకోవాలంటూ....
క్రిస్మస్ నుంచి నేర్చుకోవాలి: అఖిలేశ్ యాదవ్
న్యూఢిల్లీ, అక్టోబరు 19: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ దీపావళి ఉత్సవాల సందర్భంగా దీపాలు, కొవ్వొత్తులపై చేసే ఖర్చుతోపాటు క్రిస్మస్ వేడుకల నుంచి నేర్చుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. యూపీ ప్రభుత్వం దీపావళి సందర్భంగా చేసే ఖర్చును ప్రస్తావిస్తూ శనివారం అఖిలేష్ మాట్లాడారు. ‘నేను రాముడి పేరు మీద ఒక సలహా ఇస్తాను. క్రిస్మస్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని నగరాలు వెలిగిపోతుంటాయి. నెలల తరబడి పండగ లైటింగ్స్ ఉంటాయి. వారి నుంచి మనం నేర్చుకోవాలి. మనం ఎందుకు దీపాలు, కొవ్వొత్తులపై డబ్బు ఖర్చు చేయాలి? ఈ ప్రభుత్వం నుంచి మనం ఏం ఆశించగలం. ఈ ప్రభుత్వాన్ని దింపివేయాలి. మేం మరిన్ని అందమైన లైట్లు ఉండేలా చూసుకుంటాం’’ అని అన్నారు. అఖిలేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యల పట్ల బీజేపీ నేతలు, వీహెచ్‌పీ నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.