Pilot Suspension: ప్రయాణికుడిపై ఎయిర్ ఇండియా పైలెట్ దాడి
ABN , Publish Date - Dec 21 , 2025 | 06:50 AM
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడిపై దాడి చేసిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పైలెట్‌ను ఆ సంస్థ సస్పెండ్ చేసింది.
న్యూఢిల్లీ, డిసెంబరు 20: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడిపై దాడి చేసిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పైలెట్‌ను ఆ సంస్థ సస్పెండ్ చేసింది. అంకిత్ దివాన్ అనే ప్రయాణికుడిపై ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్-1 వద్ద అతడు దాడి చేశాడు. ఆ టెర్మినల్ సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద కొందరు వైమానిక సిబ్బంది ప్రయాణికుల క్యూలోకి చొరబడడాన్ని అంకిత్ ప్రశ్నించారు. దీంతో వారిలో ఉన్న కెప్టెన్ వీరేందర్ సెజ్వాల్ అనే పైలెట్ అతడిని దూషించాడు. అంతటితో ఆగకుండా రక్తం వచ్చేలా కొట్టాడని అంకిత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దీంతో ఆ పైలెట్ షర్ట్ పై తన రక్తం మరకలు కూడా పడ్డాయని అందుకు సంబంధించిన ఫొటోలను అంకిత్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ‘ఎక్స్’లో స్పందిస్తూ.. పూర్తిస్థాయి విచారణ తర్వాత ఆ పైలెట్‌పై తగు చర్యలు తీసుకుంటామని తెలిపింది.