Air India: అహ్మదాబాద్ బాధిత కుటుంబాలకు తాత్కాలిక పరిహారం చెల్లింపు
ABN , Publish Date - Jul 27 , 2025 | 06:04 AM
అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితుల కుటంబాలకు ఎయిర్ ఇండియా తాత్కాలిక పరిహారం చెల్లించింది.
న్యూఢిల్లీ, జూలై 26: అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధితుల కుటంబాలకు ఎయిర్ ఇండియా తాత్కాలిక పరిహారం చెల్లించింది. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలతక్షణ ఆర్థిక అవసరాల నిమిత్తం రూ.25 లక్షల తాత్కాలిక పరిహారాన్ని అందజేసినట్లు శనివారం ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. గత నెల 12న జరిగిన విమాన ప్రమాదంలో మొత్తం 260 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 166 మంది బాధిత కుటుంబాలకు తాత్కాలిక పరిహారం చెల్లించామని, మిగతా వారికి త్వరలో చెల్లింపులు జరుపుతామని పేర్కొంది. అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధిత కుటుంబాలకు రూ. కోటి చెల్లిస్తామని ఎయిరిండియా ప్రకటించిన సంగతి తెలిసిందే.