Adani Group: ఆమ్కా జెట్‌ల రేసులో..హైదరాబాదీ సంస్థతో అదానీ జట్టు
ABN , Publish Date - Oct 13 , 2025 | 06:43 AM
దేశీయంగా అభివృద్ధి చేయనున్న ఐదోతరం స్టెల్త్ యుద్ధ విమానం ఆమ్కా (అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) ప్రొటోటైప్ తయారీ రేసులో హైదరాబాదీ సంస్థ కూడా భాగస్వామ్యం అవుతోంది.
ఎంటార్ టెక్నాలజీస్‌తో కలసి కన్సార్షియం?
హైదరాబాద్, అక్టోబరు 12: దేశీయంగా అభివృద్ధి చేయనున్న ఐదోతరం స్టెల్త్ యుద్ధ విమానం ‘ఆమ్కా (అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్)’ ప్రొటోటైప్ తయారీ రేసులో హైదరాబాదీ సంస్థ కూడా భాగస్వామ్యం అవుతోంది. ఆమ్కా ప్రొటోటైప్ కాంట్రాక్టును దక్కించుకునేందుకు అదానీ గ్రూపులోని అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థ తాజాగా హైదరాబాద్‌కు చెందిన ‘ఎంటార్ టెక్నాలజీస్’ సంస్థతో జట్టుకట్టినట్టు తెలిసింది. విశ్వసనీయవర్గాలను ఉటంకిస్తూ బిజినెస్ స్టాండర్డ్ దీనిపై కథనాన్ని ప్రచురించింది. ప్రెసిషన్ ఇంజనీరింగ్ (కీలకమైన పరికరాలు, విడిభాగాలను ఎలాంటి లోపాలు లేకుండా అత్యంత కచ్చితత్వంతో తయారు చేయడం)లో ఎంటార్ టెక్నాలజీస్ సంస్థకు మంచి గుర్తింపు ఉంది. న్యూక్రియర్ పవర్ కార్పొరేషన్, ఇస్రో, డీఆర్‌డీవో తదితర సంస్థలకు ఎన్నో సంస్థలు ఎంటార్ టెక్నాలజీస్ కస్టమర్లుగా ఉన్నాయి. చంద్రయాన్-2, మంగళ్‌యాన్ మిషన్లకు అవసరమైన ఎలక్ట్రో న్యూమాటిక్ వ్యవస్థలను ఈ సంస్థే సరఫరా చేసింది.