Misconduct Allegations: నటి ఆరోపణ.. కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి రాజీనామా
ABN , Publish Date - Aug 22 , 2025 | 07:12 AM
ఓ రాజకీయ పార్టీకి చెందిన యువ నాయకుడు ఒకరు తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ మలయాళ నటి, మాజీ జర్నలిస్ట్ రిని ఆన్ జార్జ్ చేసిన ఆరోపణలు కేరళ కాంగ్రెస్‌లో ప్రకంపనలు రేపాయి.
పతనంతిట్ట/కోచి, ఆగస్టు 21: ఓ రాజకీయ పార్టీకి చెందిన యువ నాయకుడు ఒకరు తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ మలయాళ నటి, మాజీ జర్నలిస్ట్ రిని ఆన్ జార్జ్ చేసిన ఆరోపణలు కేరళ కాంగ్రెస్‌లో ప్రకంపనలు రేపాయి. ఆయన పలు సందర్భాల్లో అసభ్యకరమైన సందేశాలు పంపారని, హోటల్‌కు రమ్మన్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే ఆ నేత ఎవరన్నది మాత్రం ఆమె వెల్లడించ లేదు. ఈ ఆరోపణల నేపథ్యంలో పాలక్కడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, కేరళ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు రాహుల్ మామ్‌కూటతిల్‌ను లక్ష్యంగా చేసుకుని బీజేపీ, సీపీఎం శ్రేణులు నిరసనలు చేపట్టాయి. ఈ పరిణామాలతో మామ్‌కూటతిల్.. యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు గురువారం ప్రకటించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆయన అన్నారు.