Share News

ఏసీల కనిష్ఠ ఉష్ణోగ్రత ఇక 20 డిగ్రీలకే పరిమితం

ABN , Publish Date - Jun 12 , 2025 | 05:44 AM

అవసరం ఉన్నా లేకున్నా.. కొందరు ఏసీ ఉష్ణోగ్రతను 16 డిగ్రీలు పెట్టేసి దుప్పటి ముసుగు తన్ని నిద్రపోతుంటారు.

ఏసీల కనిష్ఠ ఉష్ణోగ్రత ఇక 20 డిగ్రీలకే పరిమితం

న్యూఢిల్లీ, జూన్‌ 11: అవసరం ఉన్నా లేకున్నా.. కొందరు ఏసీ ఉష్ణోగ్రతను 16 డిగ్రీలు పెట్టేసి దుప్పటి ముసుగు తన్ని నిద్రపోతుంటారు. ఇలాంటి విద్యుత్‌ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, దేశ విద్యుత్‌ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఏసీల కనిష్ఠ ఉష్ణోగ్రతపై పరిమితులు విధించనుంది. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఏసీల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతను 16 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెట్టుకోవచ్చు. కానీ, ప్రతిపాదిత నిబంధన ప్రకారం ఏసీ కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలకు.. గరిష్ఠ ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియ్‌సకు పరిమితం కానుంది.


అంటే, 20 డిగ్రీల కంటే ఉష్ణోగ్రతను తగ్గించలేరు. అలాగే 28 డిగ్రీల కంటే ఉష్ణోగ్రతను పెంచలేరు. ఈ మేరకు ఏసీల్లో మార్పులు చేసేందుకు తయారీ సంస్థలతో ప్రభుత్వం పని చేస్తోంది. గృహ, వాణిజ్య అవసరాలకు వినియోగించే అన్ని రకాల ఏసీలతోపాటు వాహనాల్లో ఉపయోగించే ఎయిర్‌ కండిషనర్లల్లోనూ ఈ మార్పులు చేయనున్నారు.

Updated Date - Jun 12 , 2025 | 05:44 AM