ABVP victory: ఢిల్లీ వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం
ABN , Publish Date - Sep 20 , 2025 | 04:01 AM
ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో ఏబీవీపీ సత్తా చాటింది. యూనియన్ అధ్యక్ష పదవితో పాటు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను గెలుచుకుంది...
న్యూఢిల్లీ, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో ఏబీవీపీ సత్తా చాటింది. యూనియన్ అధ్యక్ష పదవితో పాటు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంస్థ ఎన్‌ఎ్‌సయూఐ ఉపాధ్యక్ష పదవి దక్కించుకుంది. ఏబీవీపీ తరపున ఆర్యన్ మాన్ డీయూఎ్‌సయూ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఏబీవీపీకి చెందిన కునాల్ చౌధరి కార్యదర్శిగా, దీపికా ఝా సంయుక్త కార్యదర్శిగా గెలిచారు. ఎన్‌ఎ్‌సయూఐకి చెందిన రాహుల్ ఝాంస్లా ఉపాధ్యక్షుడిగా విజయం సాధించారు. వామపక్షాలకు చెందిన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్‌ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎన్‌ఎ్‌సయూఐ అధ్యక్ష, సంయుక్త కార్యదర్శి పదవులు దక్కించుకుంది. మరోవైపు తాజా గెలుపొందిన ఏబీవీపీ నేతలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తదితరులు అభినందించారు.