Aadhaar Card: ఎస్‌ఐఆర్‌లో 12వ ధ్రువ పత్రంగా ఆధార్ కార్డు
ABN , Publish Date - Sep 13 , 2025 | 04:00 AM
దేశవ్యాప్తంగా చేపట్టే ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్)లో ఓటర్ల ఆధార్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఈసీ నిర్ణయించింది...
న్యూఢిల్లీ, సెప్టెంబరు 12: దేశవ్యాప్తంగా చేపట్టే ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్)లో ఓటర్ల ఆధార్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఈసీ నిర్ణయించింది. ఎస్‌ఐఆర్ సమయంలో సమర్పించే ధ్రువపత్రాల జాబితాలో ఆధార్‌ను కూడా చేర్చాలని రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారుల(సీఈవోల)కు సూచించింది. ఓటరు జాబితా వెరిఫికేషన్ సందర్భంగా ఓటరు గుర్తింపు కోసం ప్రస్తుతం పరిశీలిస్తున్న 11 ధ్రువపత్రాలతోపాటు ఆధార్‌ను కూడా చేర్చాలంటూ ఈ నెల 8న సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.