SN Subrahmanyan: వారంలో 90గంటలు పని వ్యాఖ్యలు నా భార్యకు కూడా నచ్చలేదు
ABN , Publish Date - Aug 20 , 2025 | 04:09 AM
ఆదివారాలతో కలిపి వారంలో 90 గంటలపాటు పని చేయాలంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలు తన భార్యకు కూడా నచ్చలేదని ఎల్‌అండ్‌టీ కంపెనీ సీఎండీ ఎస్‌ఎన్ సుబ్రమణ్యన్ ...
ఎల్‌అండ్‌టీ సీఎండీ సుబ్రమణ్యన్ వివరణ
న్యూఢిల్లీ, ఆగస్టు 19: ఆదివారాలతో కలిపి వారంలో 90 గంటలపాటు పని చేయాలంటూ గతంలో తాను చేసిన వ్యాఖ్యలు తన భార్యకు కూడా నచ్చలేదని ఎల్‌అండ్‌టీ కంపెనీ సీఎండీ ఎస్‌ఎన్ సుబ్రమణ్యన్ తెలిపారు. ప్రాజెక్టుల్లో చోటు చేసుకుంటున్న జాప్యం, తమ వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలోనే తాను ఒత్తిడికి గురై, అప్పట్లో ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు తాను యథాలాపంగా ఆ జవాబు ఇచ్చానని, ఆ మాటలు రికార్డవుతున్నాయని తనకు తెలియదన్నారు.