Share News

7400 HIV Cases: ఒకే జిల్లాలో 7400 హెచ్‌ఐవీ కేసులు!

ABN , Publish Date - Dec 12 , 2025 | 03:46 AM

హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కొన్నిచోట్ల ప్రజలు అవగాహన లోపంతో....

7400 HIV Cases: ఒకే జిల్లాలో 7400 హెచ్‌ఐవీ కేసులు!

  • బిహార్‌లోని సీతామఢీ జిల్లాలో నిర్ధారణ

  • వీరిలో 400 మంది చిన్నారులు!

పట్నా, డిసెంబరు 11: హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కొన్నిచోట్ల ప్రజలు అవగాహన లోపంతో ఆ వైరస్‌ బారిన పడుతూనే ఉన్నారు. బిహార్‌లోని సీతామఢీ జిల్లాలో ఏకంగా 7400 మంది హెచ్‌ఐవీ బాధితులు ఉన్నట్లు ఓ అధికారిక నివేదిక పేర్కొంది. వీరిలో 400 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపింది. జిల్లా ఆస్పత్రిలోని ఏఆర్‌టీ సెంటర్‌ నిర్వహించిన పరీక్షల్లో.. ఈ చిన్నారులకు తమ తల్లిదండ్రుల ద్వారా ఈ వ్యాధి సంక్రమించినట్లు నిర్ధారణ అయింది. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు హెచ్‌ఐవీ బారిన పడితే.. వారి పిల్లలు పుట్టుకతోనే ఈ వైరస్‌ బాధితులవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రజల్లో హెచ్‌ఐవీ పట్ల సరైన అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని వారు పేర్కొంటున్నారు. జిల్లాలో ప్రతి నెలా 50 నుంచి 60 దాకా హెచ్‌ఐవీ పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అవుతున్నాయని, ప్రస్తుతం 5వేల మందికి పైగా వైద్య చికిత్స అందిస్తున్నామని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ హసీన్‌ అక్తర్‌ తెలిపారు.

Updated Date - Dec 12 , 2025 | 03:46 AM