Share News

ISRO: 7 ఉన్నత విద్యాసంస్థల్లో అంతరిక్ష ప్రయోగశాలలు

ABN , Publish Date - Dec 22 , 2025 | 04:34 AM

దేశంలో అంతరిక్ష రంగాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటుచేసిన ఇన్‌స్పేస్‌.. అంతరిక్ష సాంకేతిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు....

ISRO: 7 ఉన్నత విద్యాసంస్థల్లో అంతరిక్ష ప్రయోగశాలలు

న్యూఢిల్లీ, డిసెంబరు 21: దేశంలో అంతరిక్ష రంగాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటుచేసిన ఇన్‌స్పేస్‌.. అంతరిక్ష సాంకేతిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా ఏడు ఉన్నత విద్యా సంస్థల్లో అంతరిక్ష ప్రయోగశాల (స్పేస్‌ ల్యాబ్‌)లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ నిమిత్తం ప్రతిపాదన కోసం అభ్యర్థన (రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌)ను జారీచేసింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఉన్నత విద్యా సంస్థల్లో అత్యాధునిక వసతులతో కూడిన అంతరిక్ష ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలనేది ఇన్‌స్పేస్‌ లక్ష్యం. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఏడు వేర్వేరు జోన్ల నుంచి దశలవారీగా ఏడు విద్యాసంస్థలను ఎంపిక చేస్తారు. వీటిలో ఏర్పాటు చేసే స్పేస్‌ ల్యాబ్‌ల కోసం ఇన్‌స్పేస్‌ 75 శాతం వరకు ఆర్థిక సాయం అందిస్తుంది. ఒక్కో సంస్థకు రూ.5 కోట్ల పరిమితితో విడతల వారీగా నగదు అందిస్తుంది.

Updated Date - Dec 22 , 2025 | 04:34 AM