Maharashtra Bomb Discovery: పొలంలో 453కిలోల బాంబు..నిర్వీర్యం చేసిన ఆర్మీ
ABN , Publish Date - May 03 , 2025 | 04:29 AM
మహారాష్ట్ర వర్వాండి గ్రామంలోని ఓ రైతు పొలంలో 453 కిలోల భారీ బాంబు బయటపడింది. నెలరోజుల అనుమతుల తర్వాత ఆర్మీ సిబ్బంది దీన్ని నిర్వీర్యం చేసి పెను ప్రమాదాన్ని తప్పించారు.
అహల్యానగర్, మే 2: మహారాష్ట్రలోని ఓ పొలంలో 453 కిలోల భారీ బాంబు బయటపడింది. పేలే అవకాశం చాలా ఎక్కువగా ఉన్న ఆ బాంబును ఆర్మీ సిబ్బంది నిర్వీర్యం చెయ్యడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ బాంబు పేలి ఉంటే.. కిలోమీటరు పరిధిలోని ఇళ్లు, భవనాలన్నీ ధ్వంసమయ్యేవి. నాలుగు కిలోమీటర్ల మేర భూమి అదిరిపోయేది. అహల్యానగర్ జిల్లా వర్వాండి గ్రామంలోని తన పొలంలో పైపులు పగిలిపోగా రాజేందర్ అనే రైతు మార్చి 28న మరమ్మతులు చేపట్టాడు. ఇందులో భాగంగా భూమిని తవ్వగా బాంబు కనిపించింది. అయితే, బాంబును నిర్వీర్యం చేయడానికి అధికారిక అనుమతులు రావడానికి నెలరోజుల సమయం పట్టింది. ఈ నెలరోజులు బాంబు ఉన్న ప్రాంతంలోని ప్రజలను వేరే చోటికి తరలించారు.
ఇవి కూడా చదవండి..