NTU Kakinada: ఏపీ ఈఏపీసెట్‌కు 3,60,119 దరఖాస్తులు
ABN , Publish Date - May 03 , 2025 | 05:09 AM
ఏపీ ఈఏపీసెట్–2025కి రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,60,119 మంది దరఖాస్తు చేశారు. మే 19 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.
12 నుంచి హాల్ టికెట్లు
జేఎన్టీయూకే, మే 2(ఆంధ్రజ్యోతి): ఏపీఎస్సీహెచ్‌ఈ నేతృత్వంలో కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్న ఏపీ ఈఏపీసెట్-2025కు ఇప్పటివరకు 3,60,119 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని సెట్ చైౖర్మన్, జేఎన్టీయూకే ఉప కులపతి సీఎ్‌సఆర్కే ప్రసాద్ శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఇంజనీరింగ్‌కు 2,78,896, అగ్రికల్చర్ ఫార్మసీకి 80,313, రెండింటికీ 910 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. రూ.2వేలు అపరాధ రుసుముతో ఈ నెల 7వ తేదీ వరకు, రూ.4వేలు అపరాధ రుసుముతో ఈ నెల 12వ తేదీ వరకు, రూ.10వేలు అపరాధ రుసుముతో ఈ నెల 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
ఇవి కూడా చదవండి..