Share News

CM Mohan Yadav: పర్యాటకంలో రూ.3,500 కోట్ల పెట్టుబడులు

ABN , Publish Date - Oct 12 , 2025 | 03:05 AM

మధ్యప్రదేశ్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి ఆకాశమే హద్దుగా ముందుకెళ్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ అన్నారు. శనివారం భోపాల్‌లోని కుషాభావు...

CM Mohan Yadav: పర్యాటకంలో రూ.3,500 కోట్ల పెట్టుబడులు

  • ప్రతి యేటా అక్టోబరులో ట్రావెల్‌మార్ట్‌: మధ్యప్రదేశ్‌ సీఎం

హైదరాబాద్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): మధ్యప్రదేశ్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి ఆకాశమే హద్దుగా ముందుకెళ్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ అన్నారు. శనివారం భోపాల్‌లోని కుషాభావు ఠాక్రే అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌లో మధ్యప్రదేశ్‌ ట్రావెల్‌ మార్ట్‌-2025ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో రానున్న కాలంలో రూ.3,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ పర్యాటక రంగాలకు చెందిన టూర్‌ ఆపరేటర్లు ముందుకొచ్చారన్నారు. అత్యధికంగా రిసార్టులు, హోటళ్లు నిర్మాణానికి ఆయా సంస్థలు ఆసక్తి కనబర్చాయని వివరించారు. సినీరం గం నుంచి వచ్చే ఐదేళ్లలో రూ.50 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు బాలా జీ టెలీఫిల్మ్‌ ఒప్పందం కుదుర్చుకుందన్నారు. సినీరంగ ప్రముఖులు ఏక్తాకపూర్‌, గజరాజ్‌రావు, రఘువీర్‌ యాదవ్‌లు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేశారన్నారు. పర్యాటకంతోపాటు ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టే వారికి 30 శాతం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఇకపై ప్రతి ఏడాది అక్టోబరులో ట్రావెల్‌ మార్ట్‌ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమానికి కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ హాజరవ్వగా.. 27 దేశాల నుంచి 80 మందికిపైగా విదేశీ టూర్‌ ఆపరేటర్లు, 150 మందికిపైగా దేశీయ టూర్‌ ఆపరేటర్లు పాల్గొన్నారు

Updated Date - Oct 12 , 2025 | 03:05 AM