Maoists Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్
ABN , Publish Date - Dec 19 , 2025 | 04:16 AM
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కిష్టారం అడవుల్లో మావోయిస్టులు, డీఆర్‌జీ బలగాల మధ్య గురువారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు...
ముగ్గురు మావోయిస్టుల మృతి
చర్ల, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఛత్తీ్‌సగఢ్‌లోని సుక్మా జిల్లా కిష్టారం అడవుల్లో మావోయిస్టులు, డీఆర్‌జీ బలగాల మధ్య గురువారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఒక మహిళ ఉంది. కిష్టారం అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో డీఆర్‌జీ బలగాలు కూంబింగ్ చేపట్టగా ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. చనిపోయినవారు మావోయిస్టు పార్టీ కిష్టారం ఏరియా కమిటీ సభ్యులైన మడివి జోగా, సోది బండి, నుప్నో బజ్జీ (మహిళ)గా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి మూడు తుపాకులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుని, మృతదేహాలను జిల్లా కేంద్రానికి తరలించారు.