Marriage Scam: 21 ఏళ్లు 12 పెళ్లిళ్లు
ABN , Publish Date - May 03 , 2025 | 04:55 AM
12 సార్లు వివాహం చేసి, డబ్బు, నగలు దోచిన ‘డాకూ దుల్హన్’ గుల్షనా రియాజ్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహాల పేరుతో మోసం చేసిన గ్యాంగ్‌లో ఆమెతోపాటు మరో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.
వివాహమైన వెంటనే నగలు, నగదుతో పరార్
యూపీలో ‘దొంగ పెళ్లి కూతురు’ అరెస్టు
లఖ్‌నవూ, మే 2: గుజరాత్‌కు వెళ్తే ఆమె పేరు కాజల్, హరియాణాలో ఉంటే సీమా, బిహార్‌లో నేహా, ఉత్తరప్రదేశ్‌లో అయితే ఆమె పేరు స్వీటీ. అసలు పేరు మాత్రం గుల్షానా రియాజ్ ఖాన్. వయసు 21 ఏళ్లు. ఇప్పటికే 12 సార్లు పెళ్లిళ్లు చేసుకుంది. అందర్నీ మోసగించి ఉడాయించింది. అసలు భర్త రియాజ్ ఖాన్ ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో టైలర్‌గా పనిచేస్తున్నాడు. ఈ దొంగ పెళ్లిళ్ల వ్యవహారం అతడికి పూర్తిగా తెలుసు. ప్రతి పెళ్లికి 5ు సొమ్మును కమీషన్‌గా కూడా తీసుకుంటున్నాడు. హడావిడిగా పెళ్లి సంబంధం కుదుర్చుకోవడం, ఘనంగా వివాహం చేసుకోవడం, పెళ్లి తంతు ముగిసిన కొద్ది గంటల్లోనే కిడ్నాప్ నాటకమాడి నగలు, నగదుతో పరారు కావడం ఆమెకు నిత్యకృత్యం. ఆ ‘దొంగ పెళ్లి కూతురు’ (డాకూ దుల్హన్) ఎట్టకేలకు గురువారం అంబేడ్కర్ జిల్లాలోని కసదాహా గ్రామంలో పోలీసులకు చిక్కింది. ఆమెతో పాటు ముఠాలోని మరో 8మందిని అరెస్టు చేశారు. ఈ ముఠాలో గుల్షనాతోపాటు అయిదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. పలు రాష్ట్రాల్లో దొంగ పెళ్లిళ్ల రాకెట్‌ను ఆ ముఠా చాలా వ్యూహాత్మకంగా నిర్వహించింది. వివాహ వెబ్‌సైట్లు, సామాజిక మాధ్యమాల ద్వారా ఎంతగా ప్రయత్నించినా కుమారులకు పెళ్లి చేయలేకపోతున్న కుటుంబాలను మొదట గుర్తించేది. మహిళలు వెళ్లి మాటలు కలిపి ఆ కుటుంబాల నమ్మకం పొందేవారు. గుల్షనాను సంబంధించిన నకిలీ పత్రాలు చూపించి సంబంధాన్ని ఓకే చేసుకునేవారు. సంబంధం కుదిర్చినందుకు ‘సెటిల్‌మెంట్ అమౌంట్’ కూడా మాట్లాడుకునేవారు. హడావిడిగా పెళ్లి ఏర్పాట్లు చేయించే వారు. పెళ్లి తంతు ముగియగానే మగవారు బైకులుపై వచ్చి ఆమెను ‘కిడ్నాప్’ చేసే వారు. ఽనగదు, నగలు దక్కించుకునేవారు.
ఇవి కూడా చదవండి..