Share News

ముంబై టెర్రర్ అటాక్.. కసబ్ కోసం 28 కోట్లు ఖర్చు.. తహవ్వుర్ కోసం ఎంతవుతుందో..

ABN , Publish Date - Apr 11 , 2025 | 11:20 AM

2008 Mumbai Terror Attack: 26/11 ముంబై దాడులకు పాల్పడ్డ అజ్మల్ కసబ్‌ను 2018లో ఉరి తీశారు. ఉరి తీసేవరకు ముంబైలోని ఆథర్ రోడ్ జైల్‌లో ఉన్నాడు. అతడి ఖర్చు కోసం ఏకంగా 28.46 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు తెలుస్తోంది.

ముంబై టెర్రర్ అటాక్.. కసబ్ కోసం 28 కోట్లు ఖర్చు.. తహవ్వుర్ కోసం ఎంతవుతుందో..
2008 Mumbai Terror Attack

2008, నవంబర్ 26.. దేశం ఎప్పటికీ మర్చిపోలేని రోజది. పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్, తోటి ఉగ్రవాదులతో కలిసి తాజ్ హోటల్‌లో మారణహోమాన్ని సృష్టించాడు. ఈ దాడిలో ఉగ్రవాదులతో కలిపి మొత్తం 175 మంది చనిపోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. కసబ్ ఒక్కడే పదుల సంఖ్యలో మందిని పొట్టన పెట్టుకున్నాడు. అలాంటి క్రూరుడ్ని అరెస్ట్ చేసి, దోషిగా తేల్చి ఉరి తీయడానికి చాలా కాలం పట్టింది. అతడ్ని అరెస్ట్ చేసి, ఉరి తీసేవారకు ప్రభుత్వం అతడి కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది. కసబ్‌ను ఉరి తీసే వరకు ముంబైలోని ఆథర్ రోడ్ జైల్‌లో ఉన్నాడు. తిండి దగ్గరినుంచి భద్రత వరకు మొత్తం 28.46 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లు తెలుస్తోంది.


దేని కోసం ఎంత ఖర్చు చేశారంటే..

గల్‌గాలి ఫైండింగ్స్ ప్రకారం.. కసబ్ భద్రత కోసం 15.05 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అతడి భద్రత కోసం కొత్తగా కొన్ని నిర్మాణాలు చేపట్టారు. అందు కోసం 52.5 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. కేవలం తిండి కోసం 43,417 రూపాయలు ఖర్చు అయింది. అనారోగ్యం వచ్చినపుడు మందులు ఇవ్వడానికి 32,097 రూపాయలు ఖర్చు అయింది. బట్టల కోసం 2,047 రూపాయలు ఖర్చు అయింది. ఉరి తీసిన తర్వాత అంత్యక్రియలు కోసం 9,573 రూపాయలు ఖర్చు అయింది. ఉరి తీసిన రోజు మాత్రం చాలా తక్కువగా ఆహారం కోసం 33.75 రూపాయలు, బట్టల కోసం 169 రూపాయలు ఖర్చు అయింది. ఇలా కసబ్ కోసం 28 కోట్ల రూపాయలపైనే ఖర్చు అయింది.


కసబ్ కోసం 28 కోట్లు.. తహవ్వుర్ కోసం ఎంతవుతుందో..

26/11 ముంబై దాడుల కేసులో నిందితుడైన తహవ్వూర్ హుస్సేన్ రాణాను ఇండియాకు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అతడ్ని 18 రోజుల పాటు రిమాండ్‌లోకి తీసుకోనుంది. అతడ్ని విచారించనుంది. ఈ నేపథ్యంలోనే కసబ్ ఖర్చు తెరపైకి వచ్చింది. కసబ్‌ను అరెస్ట్ చేసింది.. ఉరి తీసింది 2018 టైంలో. అప్పుడు నిత్యావసర ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. అలాంటి టైంలోనే 28 కోట్ల రూపాయలు ఖర్చు అయిందంటే.. ఇప్పుడు తహవ్వూర్ కోసం ఇంకెంత ఖర్చు అవుతుందో అని జనం చర్చించుకుంటున్నారు. మినిమం 100 కోట్లపైనే ఖర్చు అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి

SVPNPA Job Openings: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో డ్రీమ్ జాబ్స్..మీకు అర్హత ఉందా, అప్లై చేశారా

School Teacher: ఓ టీచరమ్మ.. నువ్వే నిద్రపోతే.. పిల్లలేం చేయాలి

Updated Date - Apr 11 , 2025 | 11:20 AM