Share News

Department of Telecommunications: సైబర్‌ నేరాలకు వాడుతున్న2 కోట్ల ఫోన్‌ కనెక్షన్లు బ్లాక్‌

ABN , Publish Date - Sep 04 , 2025 | 04:25 AM

సైబర్‌ నేరాల కోసం ఉపయోగిస్తున్న 2కోట్ల ఫోన్‌ కనెక్షన్లను కేంద్ర టెలి కమ్యూనికేషన్స్‌ విభాగం(డీవోటీ)బ్లాక్‌ చేసింది.

Department of Telecommunications: సైబర్‌ నేరాలకు వాడుతున్న2 కోట్ల ఫోన్‌ కనెక్షన్లు బ్లాక్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 3: సైబర్‌ నేరాల కోసం ఉపయోగిస్తున్న 2కోట్ల ఫోన్‌ కనెక్షన్లను కేంద్ర టెలి కమ్యూనికేషన్స్‌ విభాగం(డీవోటీ)బ్లాక్‌ చేసింది. టెలికమ్యూనికేషన్స్‌ విభాగం కార్యదర్శి నీరజ్‌ మిత్తల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. బుధవారం గోవాలో నిర్వహించిన సైబర్‌ సెక్యూరిటీ సదస్సులో ఆయన వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు. సంచార్‌ సాథీ యాప్‌ వల్ల ఇది సాధ్యమైందన్నారు. సైబర్‌ నేరగాళ్లు చేసే స్ఫూఫ్‌ కాల్స్‌ను ఈ యాప్‌ సాయంతో 97శాతం తగ్గించామన్నారు. టెలి కమ్యూనికేషన్స్‌లో భద్రత కోసం డీవోటీ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని, ప్రైవేటు సంస్థలతో కూడా కలిసి పనిచేస్తోందని వివరించారు.

Updated Date - Sep 04 , 2025 | 04:32 AM